Supreme court: జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ..! 9 d ago
మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్ పై జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం విచారణ చేపాటింది. సిబిఐ,ఈడి నివేదికలను పరిశీలించిన తర్వాత తీర్పు ఇస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. తదుపరి విచారణ జనవరి 10 కి వాయిదా వేసింది.